రావే!వచ్చి నా బాధకి ఇంత మందేసి పోవే....!
రావే!వచ్చి నా బాధకి ఇంత మందేసి పోవే....!
ఇసుమంతైనా కనికరం లేకుండా నీ సొగసుల అత్తరు జల్లి వెళ్ళావు కదటె..
అందువల్ల ఎన్ని సమస్యలో తెలుసా నీకు
గండెల్లొ ఎదో తెలియని అలజడి జడివానై నా యెదను మంచెత్తుతుందే....
రావే!వచ్చి నా బాధకి ఇంత మందేసి పోవే....!
ఇంతేనా అనుకుంటున్నావా....?
క్షణ కాలంలోనే నీ రూపును కరిగించినందుకు రెప్పపాటుపై నా ఈ అలక నీ వల్ల కాదా....!
ఓజోను పొర దెబ్బ తినకుండనే నా చిట్టి గుండెకు ఏదేదో జరుగుతుందే అదీ నీ వల్ల కాదంటావా....!
రావే!వచ్చి నా బాధకి ఇంత మందేసి పోవే....!
అంతెందుకే స్నేహితులందరూ నీకు పిచ్చెక్కిందిరా..పిచ్చెక్కిందీ... అంటూ దీర్ఘం తీస్తున్న వినకుండా....
సిరా లేని కలంతో నీ కోసం నా ఊహపుటంచుల్లొ తెగ వెతుకులాడుతున్నాను కదే!
అది చూసి కూడా జాలి కలగలేదా?
రావే!వచ్చి నా బాధకి ఇంత మందేసి పోవే....!
ఇంత జరుగుతున్నా నా ఎదురు చూపులు దేని కోసమో తెలుసా?
నువ్వు అలిగితే నే బుజ్జగించే రోజు కోసమేనే....తెలుసుకోవే.....!
రావే!వచ్చి నా బాధకి ఇంత మందేసి పోవే....!
13-02-16
NARESH GANTALA
No comments:
Post a Comment